Driving | రహదారి భద్రత నియమాలు అలవర్చుకోవాలి..

Driving | రహదారి భద్రత నియమాలు అలవర్చుకోవాలి..
Driving | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను అలవర్చుకోవాలని న్యాయ సేవాధికార నారాయణపేట జిల్లా పారా లీగల్ వాలంటీర్(Paralegal Volunteer) కే నారాయణ అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత 2026 పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటిస్తూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపవద్దని, పెద్ద వాహనాలు నడిపే డ్రైవర్లు సీటు బెల్టు విధిగా ధరించి డ్రైవింగ్(Driving) చేయాలన్నారు. డ్రైవింగ్ లైసెన్సు లేని వారు వాహనాలు నడపరాదని, ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూ క్రాసింగ్ ల వద్ద వాహనాలు ఆపి సిగ్నల్ వేసిన తర్వాత వెళ్లాలని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ లో మాట్లాడొద్దన్నారు.

