Drainage | చైర్‌పర్సన్‌గా దావ స్వాతి ప్రమాణ స్వీకారం…

Drainage | చైర్‌పర్సన్‌గా దావ స్వాతి ప్రమాణ స్వీకారం…
Drainage | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నికల అధికారి, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ఆమెతో చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం చైర్పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు, 7వ వార్డుతో పాటు బెల్లంపల్లి పట్టణ ప్రజలకు, తోటి కౌన్సిలర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వినోద్ మార్గదర్శకత్వంలో బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ , రహదారుల సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్లందరినీ సమన్వయం చేసుకుంటూ, రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా పారదర్శకంగా పాలన అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, వివిధ వార్డుల కౌన్సిలర్లు చింతల వసంత, దామెర విజయలత, బేతి శ్రావణ్ కుమార్, డీకొండ పత్మ, నిజాముద్దీన్, పీక ఎల్లాబాయి,గాలి సుమలత, కంకటి ప్రణీత, నిచ్చకోల వంశీకృష్ణ, రాగంశెట్టి సత్యనారాయణ, మేడి పున్నంచందర్,చిప్ప అర్చన, నీలి హారిక, పోలు ఉమాదేవిలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాతరి స్వామి, దావ రమేష్, ఆదర్శ్ వర్థన్ రాజు, చిలుముల శంకర్, పలువురు కార్యకర్తలు పాల్గొని చైర్‌పర్సన్‌కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
