Dr. Vakiti | వైభవంగా బ్రహ్మోత్సవాలు..

Dr. Vakiti | వైభవంగా బ్రహ్మోత్సవాలు..


Dr. Vakiti మక్తల్, ఆంధ్రప్రభ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించుకుందామని రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Dr.Vakiti Srihari) అన్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివిధ శాఖల అధికారులు చేపట్టాల్సిన పనుల గురించి వివరించడంతో పాటు అధికారుల నుండి సలహాలు సూచనలు స్వీకరించారు. అన్ని శాఖల అధికారులు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు భాగస్వాములై సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని గత ఏడాది కొత్త ఒరవడితో పట్టణ ప్రధాన రోడ్ల పై స్వాగత తోరణాలు లైటింగ్ తో ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా చేపట్టడం జరిగిందన్నారు.

భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు గాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు పట్టణ ప్రజల పై ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. బ్రహ్మోత్సవాలలో రాజకీయాలకు తావు లేదని అన్ని పార్టీల ప్రతినిధులు భాగస్వాములై కలిసి ఉత్సవాలు నిర్వహించే ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొన్ని దశాబ్దాలుగా పాడుబడిన పుష్కరిణి (కోనేరు)ను (Koneru) ఈ ఏడాది పునరుద్ధరించడం జరిగిందని భక్తులు కోనేరులో స్నానమాచరించి స్వామిని దర్శించుకున్న ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కోనేరు సుందరీకరణ పనులకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులంతా బ్రహ్మోత్సవాల సందర్భంలో అందుబాటులో ఉండి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పి.ప్రాదేశాచారి, ఆలయ ఈవో కవిత, మాజీ ఎంపీపీ అధ్యక్షులు కొండయ్య, గడ్డంపల్లి హనుమంతు, మాజీ జడ్పిటీసీ జి .లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, నాయకులు కట్టా సురేష్ కుమార్, గాయత్రి అనిల్ కుమార్, బోయ రవికుమార్, కావలి తాయప్ప, బోయ నరసింహ, పూజ శివరాజ్, తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో రమేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులు కలిసి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు విడుదల చేశారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి వాకిటి శ్రీహరి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారి, ఉడిపి పెజవార మఠం ధర్మ ప్రచారక్ విద్వాన్ రాఘవేంద్ర ఆచార్య తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు.

Leave a Reply