ఇంద్రవెల్లి బంద్ పుకార్లు నమ్మొద్దు..

  • సీఐ ఎం. ప్రసాద్ హెచ్చరిక

ఆదిలాబాద్ జిల్లా, ఆంధ్రప్రభ : ఇంద్రవెల్లిలో రేపు, (డిసెంబర్ 15, సోమవారం)బంద్ జరుగుతుందంటూ వస్తున్న పుకార్లను ప్రజలు, వ్యాపారస్తులు ఎవరూ నమ్మవద్దని ఉట్నూరు సీఐ మడవి ప్రసాద్ స్పష్టం చేశారు. వ్యాపార సముదాయాలు యథావిధిగా, నిర్భయంగా తెరిచి ఉంచవచ్చని ఆయన తెలియజేశారు.

బలవంతంగా దుకాణాలను మూసివేయడానికి ప్రయత్నించినా, బంద్‌కు సహకరించాలంటూ బెదిరించినా కఠినమైన పోలీసు చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ ప్రసాద్ హెచ్చరించారు.

Leave a Reply