Dongli | నట్టల నివారణ మందుతో జీవాలకు ఆరోగ్యం
- మదన్ హిప్పర్గా సర్పంచ్ లక్ష్మణ్ బచావార్
Dongli | డోంగ్లి, ఆంధ్రప్రభ : నట్టల కారణంగా గొర్రెలు, మేకలకు ఎదురయ్యే నష్టాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా మందు పంపిణీ చేస్తోందని మదన్ హిప్పర్గా సర్పంచ్ లక్ష్మణ్ బచావార్ అన్నారు. డోంగ్లి మండలంలోని మదన్ హిప్పర్గాలో నట్టల నివారణ మందు పంపిణీలో పాల్గొని మాట్లాడారు. నట్టల నివారణ చర్యలతో జీవాలు ఆరోగ్యంగా ఉండడమే కాక పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉంటుందని తెలిపారు. ఈమేరకు పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీరితో ఉప సర్పంచ్ సరుబాయి, ఓఎస్ శంకర్, గోపాల మిత్ర సయ్యాజీ, తదితరులు పాల్గొన్నారు.

