పాఠశాలలో వేదిక కోసం లక్ష రూపాయల విరాళం…

పాఠశాలలో వేదిక కోసం లక్ష రూపాయల విరాళం…

జుక్కల్,ఆంధ్రప్రభ : మారుతున్న కాలంతోపాటు బడిపంతుల్లో కూడా మార్పులు వచ్చాయి. బడికి అలస్యంగా రావటం, తొందరగా వెళ్లిపోవడం,వీదులకు డుమ్మా కొట్టడం,బినామీ టీచర్లను ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. దీనికి భిన్నంగా జుక్కల్ మారుమూల ప్రాంతంలో సంవత్సరంన్నార నుండి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటు, సమయ పాలన కొనసాగిస్తూ,నిస్వార్థంగా విద్యాబోధన అందిస్తున్న ఉపాధ్యాయురాలు మీరాబాయి మరోసారి తమ దయాద్రహృదయాన్ని చాటుకోవటం జరిగింది వివరాలకు వెళితే సరిహద్దు ప్రాంతం అయిన జుక్కల్ మండలంలోని పెద్దఎడ్గి హైస్కూల్లో సాంఘిక శాస్త్రం బోధిస్తున్న మీరాబాయి తను ఉదారత చాటుకుంటున్నారు.

తము విధులు నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థుల అభివృద్ధి,పాఠశాల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తూ గతంలో హైస్కూల్లో లైట్లు,ఫ్యాన్లు,ప్రింటర్ అందించడమే కాకుండా కుర్చీలను సైతం ఇప్పించడం జరిగింది.తాజా గా హైస్కూల్లో సంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహణకు గాను వేదిక కోసం ఒక లక్ష రూపాయల విరాళం ప్రకటించడం కాకుండా బుధవారం నాడు జుక్కల్ విద్యాశాఖ అధికారి తిరుపతయ్య,గ్రామ సర్పంచ్ ఆస్పత్వర్ అనిల్ కుమార్ తో కలిసి వేదిక కోసం భూమి పూజ చేశారు.

సదరు ఉపాధ్యాయురాలికి గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు,యువకులు సయితం కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య,ఐక్యత యూత్ ప్రెసిడెంట్ రవితో పాటు అశ్వత్వార్ పండరి,రమేష్ గ్రామస్తులు,ఉపాధ్యాయ బృందం,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply