Donation |కాంగ్రెస్ నాయకులు వేల్పుల మురళీ…

Donation |కాంగ్రెస్ నాయకులు వేల్పుల మురళీ…
Donation | వైరా,ఆంధ్రప్రభః మత సామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తూ… దానిని చాటి చెబుతూ… అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందుతున్నారు వైరా మండల పరిధిలోని వల్లపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వేల్పుల మురళి…ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వేల్పుల మురళి తన స్వ గ్రామంలో, తన సొంతడబ్బులతో మసీదుకు మైక్ ను వితరణగా అందజేశారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ చేతులమీదుగా వేల్పుల మురళి వల్లాపురం మసీదుకు మైకు సెట్ ను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, ఇప్పటికే గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల మురళి మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులకు మసీదుకు మైకు అందించడం నిజంగా అభినందించదగ్గ విషయమని మురళిని అయన ప్రత్యేకంగా అభినందించారు.
హిందూ ముస్లింలు భాయి భాయిగా ఉండాలని ఉంటూ అన్ని మతాలు సమానంగా భావిస్తూ… లౌకికవాదాన్ని పెంపొందించాలన్నారు.. . ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మాజీ
