donation | ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం

donation | ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం

  • కూటమి నేతల చేతుల మీదుగా దాతలకు సన్మానం..

donation | ఘంటసాల, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా లంకపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవల వెంకటేశ్వరరావు సరస్వతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు చెన్నకేశవల నాగమలేశ్వరరావు – ఉమామహేశ్వరి దంపతులు, చెన్నకేశవల నాని – సంధ్యారాణి దంపతులు శ్రీకాకుళం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా దాతలను కూటమి నేతలు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), దాసం రామకృష్ణ, కొండవీటి కోటేశ్వరరావు, తమ్మన సోమేశ్వరరావు, మేక పుల్లయ్య, నవతా రాంబాబు, తమ్మన తాతయ్య, గాజుల సత్యం, గాదె వెంకటేశ్వరరావు తదితరులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొని ఆలయ అభివృద్ధికి దాతల సహకారం ప్రశంసనీయమని కొనియాడారు.

Leave a Reply