Donation | నిత్యాన్నదానానికి విరాళం

Donation | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, రంగాపురం గ్రామం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న వసతులు–సౌకర్యాలు, నిత్యం నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలను పరిశీలించిన హైదరాబాద్‌ నివాసి, బుధల గోత్రానికి చెందిన గుమ్మ రామకృష్ణ–ప్రశాంతి దంపతులు ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారంగా రూ.25వేలు అందజేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రామకృష్ణ–ప్రశాంతి దంపతులను ఈవో శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు, సిబ్బంది శాలువాతో సత్కరించి వేద ఆశీర్వచనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సేవకు ఇటువంటి విరాళాలు ఎంతో దోహదపడతాయని ఆలయ పాలకమండలి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply