దీనంగా వేడుకుంటున్న బాధితులు..

నంద్యాల బ్యూరో, అక్టోబర్ 29 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal district) ఆత్మకూరు మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఆరవేసిన మొక్కజొన్న విత్తనాలు వరద నీటిలో మునిగిపోయాయి. నీట మునిగిన మొక్కజొన్న గింజలు చేతికొచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో సర్వనాశనం అయిపోయిందని రైతులు కన్నీటి పర్వంతమయ్యారు.

నీట మునిగిన పంటలను పర్యవేక్షించేందుకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ (Collector Karthik), శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లు అధికారులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా భరోసా కల్పించారు.

Leave a Reply