కొనుగోళ్ల‌తో మార్కెట్లు కిట‌కిట‌

బంతిపూలు, దీపాలకు భ‌లే డిమాండ్

మక్తల్, అక్టోబర్ 20 (ఆంధ్రప్రభ) : దీపావళి పండుగ వచ్చిందంటే చాలు బంతిపూలు, దీపాలకు (మట్టి ప్రమిదలు) ఎనలేని డిమాండ్ ఉంటుంది. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటా వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇంటి దర్వాజాలను మామిడి, బంతిపూల తోరణాలతో అందంగా అలంకరిస్తుంటారు. అదేవిధంగా కార్తీక మాసం అమావాస్య సందర్భంగా దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ క్రమంలో దీపాలు, బంతిపూలను నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రాల్లో ప్రధాన రహదారులపై రాశులుగా పోసి అమ్ముతుంటారు. బంతిపూలు 100 రూపాయలకు కిలో చొప్పున అమ్ముడుపోతుండగా.. దీపాలు 50 నుండి 75 రూపాయలకు డజన్ చొప్పున అమ్ముతున్నారు. సాధారణ రోజుల్లో 20 నుంచి 30 రూపాయలకు డజన్ దొరికే దీపాలు.. దీపావళి పండుగ వేళ ఉన్న డిమాండ్ కార‌ణంగా 50 నుంచి 75 రూపాయలకు అమ్ముతున్నారు.

Leave a Reply