కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే పట్టణాభివృద్ధి

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే పట్టణాభివృద్ధి

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు..

స్టేషన్ ఘనపూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపుతోనే స్టేషన్గన్పూర్ పట్టణం అభివృద్ధి చెందుతుందని జనగామ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మాగజోడు రాంబాబు అన్నారు. గురువారం స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14, 15 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఆశీస్సులతో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈప్రచారంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చంద్ర రెడ్డి, వార్డు ఇన్చార్జులు కోళ్ల రవి గౌడ్, గోరిగే రవి, నామాల బుచ్చయ్య, లోనే శ్రవణ్, పర్శ సిద్దేశ్, వడ్లకొండ శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply