5వ వార్డులో జిల్లా నాయకుల ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డులో శనివారం బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి పాశికంటి సంపత్ తరపున ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పసుపునూరి వీరేశం, ఐడియా శ్రీనివాస్ ప్రచార కార్యక్రమం చేపట్టారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మైదం భాస్కర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
