District Collector | బాపట్లలో యోగా సందడి

District Collector | బాపట్లలో యోగా సందడి
- జిల్లెల్లమూడిలో జాతీయస్థాయి యోగా చాంపియన్‌షిప్ ప్రారంభం
District Collector | బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : వ్యాయామ సమాహారాల ఆధ్యాత్మిక రూపం యోగ, హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలో భాగం ధ్యానం, అంత దృష్టి, పరమానంద ప్రాప్తి యోగా వలనే సాధ్యం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ యోగ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ నిర్వహణలో ఈరోజు నుండి 29వ తేదీలలో జరుగనున్న జాతీయస్థాయి యోగాసన చాంపియన్‌షిప్ 2025- 26కు సంబంధించిన పోటీలను బాపట్ల జిల్లా బాపట్ల మండలం జిల్లెల్లమూడి గ్రామంలోని శ్రీ విశ్వజనని పరిషత్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ సంయుక్తంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

జాతీయస్థాయి యోగా పోటీలకు హాజరయ్యేందుకు విచ్చేసిన నార్త్ ఇండియన్స్‌తో బాపట్ల సందడిగా మారింది. పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్ర, జార్ఖండ్ , గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి యోగా పోటీలలో పాల్గొనడానికి సుమారు 16 రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఇండియన్ యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్, ప్రధాన కార్యదర్శి మిరేనాల్ చక్రబోర్తి ,కూన కృష్ణ దేవరాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగ అసోసియేషన్ చైర్మన్ కల్లం హరినాధ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్, డాక్టర్ వి. మీనాకుమార్, విశ్వ జననీ పరిషత్ అధ్యక్షులు ఎం.దినకర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ అధ్యక్షులు కలం హరినాథ్ రెడ్డి, వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రమణ్యం, డాక్టర్ బత్తుల శరత్ బోస్, పిన్ని బోయిన శ్రీమన్నారాయణ, శీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
రాత్రి నుండి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న యోగ క్రీడాకారులను రైల్వే స్టేషన్ లో సాదరంగా స్వాగతం పలికి, ప్రత్యేక వాహనాలలో వీరిని విశ్వ జననీ పరిషత్ ప్రాంగణం వద్దకు తరలించారు. జిల్లెళ్ళమూడిలో వీరికి బస, వసతి, భోజనం తదితర ఏర్పాట్లను లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు శీలం శ్రీనివాసరావు, బాలినేడి హరిబాబు నాగరాజు తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
