Quiz | పోటీతత్వం తోనే గెలుస్తాం

క్విజ్ విజేతలకు బహుమతుల పంపిణీ

Quiz | ఆంధ్రప్రభ, సుండుపల్లె (అన్నమయ్య జిల్లా) : క్విజ్, వ్యాసరచన పోటీలలో పాల్గొని తమ సామర్థ్యాలను తెలుసుకుని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మానవతా సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు సూచించారు. ఆదివారం సుండుపల్లె తెలుగు ప్రాథమిక పాఠశాలలో మానవతా స్వచ్ఛంద సంస్థ నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల స్థాయిలో నవంబర్ 20 వతేది పదవ తరగతి విద్యార్థులకు తెలుగు హిందీ. ఇంగ్లీష్ పాఠ్యంశాలలో పదవ తరగతి విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు.పోటీలలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, మానవతా స్వచ్ఛంద సంస్థ మాజీ అధ్యక్షులు మహబూబ్ బాషా ఆర్థిక సహకారంతో నగదు బహుమతి తో పాటు సంస్థ జ్ఙాపికలు , సర్టిఫికెట్లు పంపిణి చేశారు. ఈ సమావేశంలో చైర్మన్ గంగిరెడ్డి, కన్వీనర్ క్రిష్ణం రాజు, కొ కన్వీనర్ నాగేశ్వర రావు, అధ్యక్ష్య కార్యదర్శులు లక్ష్మయ్య నాయుడు, అమృ నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply