ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..

బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ సూచనలతో భీమావారిపాలెం 11వ సచివాలయ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పెంచిన పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల ఇంటికే అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply