నిరుపేదలకు, కూలీలకు అన్నదానం పంపిణి

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; అవతార్ మెహెర బాబ జన్మదినోత్సవం పురస్కరించుకొని నిరుపేదలకు కూలీలకు అన్నదానం నిర్వహించారు. బుధవారం అవతార్ మెహరా బాబా 132వ జయంతి పురస్కరించుకొని ఉదయం అడ్డా కూలీలకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగినది. అనంతరం ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు బాబా భజనలు హారతి నిర్వహించారు. ఈకార్యక్రమంలో అవతార్ మెహెర్ బాబా వరంగల్ సెంటర్ కమిటీ సభ్యులు పాశికంటి రవికుమార్, జంగం రామ్ కుమార్, పాల ఏకాంబరం, కొలిపాక సురేష్, స్వర్గం సదానందం, అడవెల్లి రమాదేవి, శీలా, రాధా, రాణి ,ఇతర బాబా భక్తులు పాల్గొన్నారు.
