Distribution | నిరుపేదలకు అమ్మవారి చీరలు పంపిణీ

Distribution | నిరుపేదలకు అమ్మవారి చీరలు పంపిణీ

  • దాతలను అభినందించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఘంటా రవి

Distribution | కరీమాబాద్, ఆంధ్రప్రభ : శ్రీ ధన మైసమ్మ దేవాలయం, మెట్ల బావిఆలయ అధ్యక్షులు తోట బాబన్న ఆధ్వర్యంలో దాతలు నలివేల జయ రవీందర్ మహిళలకు చీరల పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ నిరుపేదలకు, వికలాంగ మహిళలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని దాతలను అభినందించారు.

శ్రీ ధన మైసమ్మ దేవాలయం, మెట్ల బావి, 34 డివిజన్, శివనగర్,అమ్మవారికి కట్టిన 82 చీరలను అమ్మవారి అనుగ్రహం పొందుట కోసం 21000 /- రూపాయలకు తూర్పుకోట వాస్తవ్యులు నలివెల జయ – రవీందర్ పుణ్య దంపతులు తీసుకొని వాటిని వారి కూతురు నలివెల సజా జ్ఞాపకార్థం అధ్యక్షులు తోట బాబన్న ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు శ్రీ దన మైసమ్మ ఆలయంలో నిరుపేద వృద్ధ మహిళలకు, నిరుపేదలు, దివ్యాంగులు, వితంతు మహిళలకు ఉచితంగా పంపిణీ చేశారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరాటే ప్రభాకర్ – ఉమా, 35వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ అభ్యర్థి మెరుగు అశోక్ ,గడ్డం రవి ఆలయ గౌరవ అధ్యక్షుడు కందకట్ల భాస్కర్, దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బండి చక్రపాణి జిల్లా కార్యదర్శి బత్తిని రాజు , కార్యదర్శి ఎండి సాదిక్ ఆలయ ఉపాధ్యక్షులు సత్యనారాయణ కోశాధికారి యాద రవి అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply