distribution | హరిత విజయవాడ దిశగా అడుగులు..

distribution | హరిత విజయవాడ దిశగా అడుగులు..
- నగరంలో 28 వేల ఉచిత మొక్కల పంపిణీ
- కాలుష్య నియంత్రణకు నగరపాలక సంస్థ చర్యలు
- సంక్రాంతి తర్వాత గులాబీ, మందార మొక్కల పంపిణీ
- డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్
distribution | విజయవాడ, ఆంధ్రప్రభ : హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చేపట్టిన ఉచిత పండ్ల, పూల మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఇప్పటివరకు 28,000 మొక్కలను ప్రజలకు అందజేసినట్లు నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు శంకల్పించిన హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ పలు పచ్చదనం కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
అందులో భాగంగా నగర పరిధిలో ఉచితంగా పండ్ల మరియు పూల మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు మామిడి 6,000, జామ 6,000, నిమ్మ 6,000, నూరువరహాలు 10,000 మొక్కలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాల్లో కనీసం ఒక మొక్కను నాటాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
అలాగే సంక్రాంతి పండుగ అనంతరం గులాబీ, మందార వంటి పూల మొక్కలను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలో పచ్చదనం పెరిగి, వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించాలని ఆయన కోరారు.
