Distribution | నిత్యవసర సరుకుల పంపిణీ

Distribution | నిత్యవసర సరుకుల పంపిణీ
- సెమీ క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవ భక్తులకు చిరుకానుక
- ఖమ్మం ఆర్సిఎం సోషల్ సర్వీస్ డైరెక్టర్ ఫాదర్ సురేష్, ఐజాగ్, జేసు ప్రసాద్
Distribution | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం ఆర్సిఎం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ఘనత వహించిన, డాక్టర్ సగిలి ప్రకాష్ బిషప్ తండ్రి ఆదేశాల మేరకు పునీత పౌల్ పేతురు దేవాలయం తిరు హృదయసభ స్థానిక విచారణ గురువు సిద్దెల జేసు ప్రసాద్, డీకన్ బ్రదర్ అరుణ్ అధ్యక్షతన ఆళ్లపల్లి ఆర్సిఎం చర్చి విచారణ ఉమ్మడి మండలాల్లోని ముత్తాపురం, జిన్నేలగూడెం, మర్కోడు, ఆళ్లపల్లి పలు గ్రామాల్లో రోమన్ కతోలిక భక్తులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని, ఖమ్మం డయాసిస్ సోషల్ సర్వీస్ డైరెక్టర్, రెవరెండ్ ఫాదర్ సురేష్, బిషప్ సలహాదారులు రెవరెండ్ ఫాదర్ ఐజాక్ తెలిపారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రార్థనతో పాటు చేతులందించి చేయూతగా ఆర్థిక సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం క్రైస్తవ భక్తులపై ఎంతైనా ఉందన్నారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కని ఆశ్రయం ఇవ్వాలని, ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని గుర్తుచేశారు. పునీత మదర్ థెరిస్సా చెప్పినట్లు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవని.. ఆస్పూర్తితోనే ఆళ్లపల్లి చర్చిలోని క్రైస్తవ భక్తులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో డీకన్ బ్రదర్ అరుణ్, డిఎస్ఎస్ సిస్టర్స్ సుపీరియర్ ప్రశాంత, ఇన్చార్జి సిస్టర్ దామరిస్, ప్రిన్సిపాల్ మహిత, ఉమ్మడి ఖమ్మం డయాసిస్ జ్యోతిర్మయి, ఆళ్లపల్లి విచారణ యానిమేటర్ పరమ ప్రభాకర్, ఉపదేశులు నారాయణ, నాగేశ్వరరావు, కిరణ్, రాములు, సంఘనాయకులు నాగేశ్వరరావు, రాంబాబు, రామ్మూర్తి, బొమ్మెర సత్యం, యూత్ జోజీ బన్నీ, నవీన్, దళం సులోచన రుక్మిణి లలిత, అన్నపూర్ణ, సునీత, జయమ్మ, రాజీ, మంగా ఏసుమని, రమణ, సుగుణ, మానస, ప్రశాంతి, రాణి లలిత, సుందరమ్మ, లక్ష్మి, కనకలక్ష్మి, కమలమ్మ, రమణ, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
