ఎమ్మెల్యేల‌ను విచారిస్తున్న స్పీక‌ర్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‍లపై (Disqualification Petitions) విచారణ కొనసాగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త‌న‌ చాంబర్‍లో విచారణ చేప‌ట్టారు. ఈ విచారణకు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy) హాజరయ్యారు.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు త‌మ‌ అడ్వకేట్లతో స‌హా హాజ‌ర‌య్యారు. ఈ నెల 1వ తేదీన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యదయ్య, ప్రకాశ్ గౌడ్ లను విచారించాలని నిర్ణయించారు. కానీ కాలే యదయ్య విచారణకు ఎక్కువ సయమం పట్టడంతో ఆ రోజున అందరి విచారణ సాధ్యం కాలేదు. దాంతో ఈ రోజు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు.

Leave a Reply