నిమజ్జనంలో అపశృతి..!
ఊట్కూర్, ఆంధ్రప్రభ : గణేష్ నిమజ్జనంలో అపశృతి (Ganesh immersion tragedy) చోటు చేసుకుంది. ఈ రోజు నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వినాయక నిమజ్జనానికి వచ్చిన ఇద్దరు చిన్నారులు (Two children) మృతి చెందిన సంఘటనతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం (Utkur mandal) తిమ్మారెడ్డిపల్లి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నారాయణపేట (Narayanpet) జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి తండాకు చెందిన పూణే నాయక్, జయమ్మ దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వలస వెళ్లి జీవనం కొనసాగిస్తుండేవారు. సొంత గ్రామమైన తిమ్మారెడ్డి తండాలో వినాయక నిమజ్జనానికి ఇద్దరు కుమారులు అభి (Abhi) (5), ఆకాష్ (Akash) (4) తో కలిసి వచ్చారు. బుధవారం ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపు (water sump) లో పడి మృతిచెందారు. ఇది గమనించిన గ్రామస్థులు చిన్నారులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల (Parents) రోదన వర్ణనాతీతం.