పేదల సొంతింటి కల నెరవేరుతుంది..

పేదల సొంతింటి కల నెరవేరుతుంది..
ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేముల శ్రీనివాస్ రెడ్డి…
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని కౌడే పద్మ శ్రీనివాస్ కురుమ నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని,పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు, పట్టణాలు లేవని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాము.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్, మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి సంతోష్ గౌడ్, పానుగంటి మహేష్ కుమార్, మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి, మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ, మేడ్చల్ మున్సిపాలిటీ ఎస్ సి సెల్ అధ్యక్షులు దండు శ్రీకాంత్ (చింటు), ఘనపురం మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…
