Director | సొంతూరు వచ్చిన రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతీ

Director | సొంతూరు వచ్చిన రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతీ
Director | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సంక్రాంతి సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు, రాజాసాబ్ డైరెక్టర్ మారుతి దాసరి తన స్వస్థలమైన మచిలీపట్నం వచ్చారు. ఖొజ్జిల్లిపేటలోని శ్రీ నాగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు లంకిశెట్టి నీరజ డైరెక్టర్ మారుతికి స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకున్నారు. మారుతి వెంట బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణి కుమార్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు విచ్చేసారు. రాజా సాబ్ మూవీ పట్ల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ నటన అత్యద్భుతంగా ఉందని ప్రేక్షకులు చెబుతుంటే ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు. ప్రేక్షకుల ఆదిరాభిమానాల పట్ల వారికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
