29న హాజరు కావాలని పీడీ, ఏపీఎంలకు ఆదేశాలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా డీఆర్డీఏ పీడీ(DRDA PD), ఊట్కూర్ ఐకేపీ ఏపీఎంలకు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సమాచార హక్కు పరిరక్షణ ఐక్యవేదిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కొనింటి నర్సింహులు తెలిపారు. ఈ నెల 29వ తేదీన ఉదయం పది గంటలకు డీఆర్డీఏ పీడీ, ఊట్కూర్(Ootkur) ఊకేపీ ఏపీఎంలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారన్నారు.
2022 నుంచి ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల వారీగా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని, నారాయణ పేట జిల్లాకు ఎన్ని చీరలు వచ్చాయి? ఒక్కో చీర ఖరీదు ఎంత ? గ్రామాల వారీగా మహిళా సంఘాల(Women’s Association)కు, మహిళలకు ఎన్ని పంపిణీ చేశారు? వాటి వివరాలు ఇవ్వాలని ఊట్కూర్ ఏపీఎంకు డీడీ ద్వారా డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వలేదని నర్సింహులు తెలిపారు.
ఫిబ్రవరి -2018 సంవత్సరం నుంచి నారాయణపేట జిల్లా(Narayanapet District) డీఆర్డీఏకు ఎన్ని నిధులు వచ్చాయి? వఆటిని ఎక్కడ ఖర్చు చేశారు? 2017లో మండల వారీగా ఎన్నీ నిధులు ఇచ్చారు? మహిళా సంఘాలకు ఎలాంటి నిధులు మంజూరు చేశారు? ప్రతి మండలంలో మహిళా సమైక్యలో శ్రీనిధి నిధులు జమ, వాటి వివరాలు, జిల్లా మొత్తం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి 2017 సంవత్సరం నుండి డీఆర్డీఏ అవగాహన చేశారని వాటి వివరాలను అడుగుతూ 31-10-2022న దరఖాస్తు చేసినా ఇంతవరకు సమాచారం ఇవ్వలేదని నర్సింహులు తెలిపారు.
అలాగే 04-02-2023నాడు నారాయణపేట జిల్లా డీఆర్డీఏ ఏపీడీకి అప్పీల్ చేసినా సమాచారం ఇవ్వలేదని రాష్ట్ర సమాచార హక్కు కమిషన్(Commission)ను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు రాష్ట్ర సమాచార కమిషన్ స్పందించింది.

