నిర్మల్ ప్రతినిధి, జూన్ 11 (ఆంధ్రప్రభ) : కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ (Telangana Digital Media Director) గా పనిచేసిన కొణతం దిలీప్ ను పోలీసులు నిర్మల్ కు తరలించారు. హైదరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
మంగళవారం రాత్రి ఆయనను నిర్మల్ (Nirmal) కు తరలించారు. ఖానాపూర్, కడెం పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో నిర్మల్ తీసుకువచ్చినట్లు సమాచారం. దిలీప్ (Dileep) ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిమిత్తం తరలించారు. కాగా ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అందుకు అనుగుణంగా ఆయనకు బెయిల్ (Bail) మంజూరు కోసం భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన లీగల్ విభాగం ప్రతినిధులు ఇప్పటికే నిర్మల్ చేరుకున్నారు.