Dil Raju: ఐటీ కార్యాలయంలో దిల్ రాజు

హైదరాబాదులోని ఐటీ కార్యాలయానికి సినీ నిర్మాత దిల్ రాజు వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆయనకు ఐటీ అధికారులు నోటీసులిచ్చారు.

ఈ క్రమంలో డాక్యుమెంట్లు, బ్యాంకు పత్రాలను తీసుకుని ఆయన ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు సినిమాలు రెండు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆయనపై ఐటీ దాడులు జరిగాయి. ఆయనతో పాటు పలువురు దర్శక నిర్మాతల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *