జనగణన మరింత సులభం

జనగణన మరింత సులభం

మీ వివరాలను మీరే నమోదు చేసుకోవచ్చు
కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యాన చంద్ర

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్ర ప్రభ : జనగణన లో ప్రజలు తమ వివరాలు తామే నమోదు చేసుకునే “స్వీయ గణన” సౌకర్యం ఉందని, దీని ద్వారా జన గణన మరింత సులభతరం అవుతుందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యానచంద్ర అన్నారు.


ఈ సందర్భంగా కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ 2027 ఫిబ్రవరిలో జరిగే జన గణన లో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని, ప్రజల వివరాలు సేకరించడానికి మే 1 నుండి 30 వరకు సిబ్బంది వస్తారని అన్నారు. కానీ సిబ్బంది ప్రజల వద్దకు రాక ముందే ప్రజలు తమకు తామే స్వీయ గణన చేసుకునే సౌకర్యం ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ప్రజలు తమ వివరాలు ట్రయిల్ లో భాగం గాhttps://test.census.gov.in/se/ లో నమోదు చేసుకొని స్వీయ గణనలో పాల్గొనవచ్చని అన్నారు

Leave a Reply