Dharna | అప్రజాస్వామిక విధానాలు విడనాడాలి

Dharna | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు విడనాడకుంటే తగిన గుణపాఠం తప్పదని రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయం కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు నాయుకులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని, అప్పలరాజును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని, ఏలూరు జిల్లా బుట్టయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్భంధం అపాలని కోరుతూ శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయం అనకాపల్లి జిల్లా రైతు రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయం కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి సూక్తులు చెప్పి అధికారంలోకి వచ్చాక అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎం. అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పి. డి. చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధించిందని అన్నారు. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీ.డీ. చట్టాన్ని రైతు నాయకుడు అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించటాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. దీనిని పవన్ కళ్యాణ్ ఖండించకపోవడం అన్యాయమన్నారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్ లో మీ కోసంలో అధికారులకు వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చందర్రావు, పోలాకి ప్రసాదరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె. నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారాపు సింహాచలం, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండయ్య, యస్‌యఫ్ఐ నాయకులు డి.చందు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొచ్చ సంతోష్, వివిధ సంఘాల నాయకులు యన్.బలరాం, ఏ. సత్యనారాయణ, ఎన్. నాగేశ్వరరావు, చందు, బి.వెంకట్రావు, ఎన్ బలరాం తదితరులు పాల్గొన్నారు.
