Dharna | నర్సింహులపేటలో ఉద్రిక్తత..

Dharna | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును తొర్రూరులో అరెస్టు చేసి మహబూబాబాద్ జిల్లాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో నర్సింహులపేట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తుండగా అక్కడ ఉన్న బిఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా పోలీస్ వాహనాన్ని అడ్డుకొని వాహనం ముందు కూర్చుని రోడ్డుపై నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్,ప్రధాన కార్యదర్శి కుంభం సుధీర్ రెడ్డి,యూత్ అధ్యక్షులు బండి రమేష్,లఘుపతి,జగదీశ్వర్,బిక్షం రెడ్డి మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.

Dharna

Leave a Reply