Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : తనకి ఒకసారి సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే దొంతపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి మండలంలోని ఉన్నతంగా నిలబెడతానని దొంతపూర్ సర్పంచ్ అభ్యర్థి సుద్దాల స్వరూప లక్ష్మణ్ ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలోని వివిధ వాడలలో ర్యాలీగా తరలివెళ్లి ఇంటింటా ప్రచారం చేశారు.కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గ్రామంలోని ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఆశీర్వదించారు తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే తన మార్కు చూపిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఒక సేవకునిగా గ్రామానికి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించాలని ఓటర్లను కోరారు .
Dharmapuri | దొంతపూరాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుతా..

