Dharmapuri | ముమ్మరంగా వాహన తనిఖీలు

Dharmapuri | ముమ్మరంగా వాహన తనిఖీలు


ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు


ఎస్పీ అశోక్ కుమార్
Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ తనిఖీలు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ ను పరిశీలించారు.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, అక్రమ నగదు, మద్యం, ఉచిత పంపిణీలు, ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అనుచిత చర్యలకు పాల్పడితే ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. “సరైన ఆధారాలు లేకుండా భారీ మొత్తంలో నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తాం అన్నారు. అత్యవసర అవసరాలకు తీసుకెళ్తే తగిన బిల్లులు, పత్రాలు వెంట ఉంచుకోవాలి” అని సూచించారు. చెక్‌పోస్ట్ సిబ్బంది ప్రతి వాహనాన్ని పకడ్బందీగా తనిఖీ చేసి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలు శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట ధర్మపురి సి.ఐ రామ్ నరసింహ రెడ్డి, ఎస్‌.ఐ లు గురక మహేష్, పులిచెర్ల ఉదయ్, సతీష్, చెక్‌పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply