ధర్మం – మర్మం : దక్షిణము దిక్కుపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

తూర్పు, ఆగ్నేయం, దక్షిణము, నైఋతి, పశ్చిమము, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కుల అధిపతులను అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తారు వీరిలో దక్షిణం దిక్కు అధిపతిని గూర్చి శ్రీమాన్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
దక్షిణమునకు అధిపతి యమధర్మరాజును పితృపతి, దక్షిణ దిక్పాలకుడు అని అందురు. సకల ప్రాణులు ఆచరిం చే పాపపుణ్యాలను లిఖించి దానికి తగిన ఫలితాన్ని అందించేవాడు నరకలోకాధిపతి యమధర్మరాజు. ఇతని సహాయకుడు చిత్రగుప్తుడు. యముడు అంటే నియమించేవాడు అని అర్థము. అందరితో సమానంగా ప్రవర్తించువాడు కావున సమవర్తి అని పేరు. భగవత్‌తత్త్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నవాడిలో పన్నెండవ వాడు, మహాజ్ఞాని యముడు. లోకంలో అందరూ ఆచరించే శుభాశుభ కార్యములకు కావాల్సిన శక్తిని, యుక్తిని అందించేవాడు యమధర్మరాజు. భగవంతునికి సహాయముగా ఆయా అవతారాలలో అవతరించినవాడు యమధర్మరాజు. కృష్టావతారంలో ధర్మరాజుగా, విదురునిగా, రామావతారం లో గజ, గవయ (వానరులు) రూపాలలో అవతరించినది, లంకలో దక్షిణ దిగ్‌ ద్వారముగా నిలిచి అక్కడే రాముడి చేత రావణాసురుని సంహారమునకు కావాల్సిన పూర్వరంగాన్ని సిద్ధం చేసినది యముడే. నచికేతునికి జ్ఞానోపదేశం చేసిన మహానుభావుడు యముడు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *