ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 08 (ఆడియోతో…)

బృహస్పతి నీతిశాస్త్రంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

ప్రయాణ కాలే స్వగృహప్రవేశే
వివాహకాలే చిప దక్షిణాంఘ్రిమ్‌
కృత్వాగత: శత్రుగృహప్రవేశే
వామం నిదద్యాత్‌ చరణం నృపాలా

ప్రయాణమునకు బయలు దేరినపుడు తన ఇంటిలోనికే తాను ప్రవేశించినపుడు వివాహ కాలంలో మొదట కుడికాలు ఇంటి లోపల పెట్టాలి. శత్రువు ఇంటిలోకి ప్రవేశించిపుడు ముందుగా ఎడమకాలు పెట్టాలి.

కుడి – జ్ఞానము, శుభము, లాభమన్న ఉపదేశమును సూచిస్తుంది. ఏదేని ప్రయాణం చేయడానికి వెళ్ళినపుడు శుభాన్ని, లాభాన్ని కోరుతాము, అలాగే వె ళ్ళేచోట తనకు తెలియనిది కొత్తది ఏదైనా తెలుసుకోవాలని, తన ఇంటిలో తాను శుభం, జయం, లాభంతో ఉండాలని కోరుకుంటారు. కావున ప్రయాణకాలంలో, గృహప్రవేశంలో ముందుగా కుడికాలు పెట్టాలి.

శత్రువు నగరానికి, అతని ఇంటిలోనికి ప్రవేశించినపుడు ముందు ఎడమకాలు పెట్టాలి. వామ పాదం భయం, అజ్ఞానం, అశుభం, నష్టం, కర్మలని సూచిస్తుంది. శత్రువుకి ఇవన్నీ కావాలని కోరతాము కావున వామపాదంతోనే ప్రవేశించాలి. అందుకనే వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు తన ఎడమకాలితో లంకలోనికి ప్రవేశిం చాడు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *