ధర్మం – మర్మం :

గంగావతరణము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

భగీరధుడు తన ప్రపితామహులు కపిల మహాముని శాపం వల్ల దుర్గతిని పొందిరని వారిని పాప రహితులను చేసి వారికి ఉత్తమ గతిని ప్రసాదించమని గంగను ప్రార్థించెను. ప్రసన్నురాలైన గంగ సకల లోకములకు ఉపకారము చేయదలచి ఆవిర్భవించెను.

లోకానాం ఉపకారార్ధం పిత ౄణాం పావనాయెచ
అగస్థ్య పీతస్య అంబోధె: పూరణాయ విశేషిత:
స్మరణాదేవ పాపానాం నాశాయ సురనిమ్నగా
భగీరధోదితం చక్రే రసాతల తలే స్థితాన్‌
భస్మీ భూతాన్‌ నృపసుతాన్‌ సాగరాన్‌ బ్రహ్మ శాపత:
వినిర్దగ్ధాన్‌ అదాప్లావ్య ఖాత పూర మధాకరోత్‌

తాత్పర్యము : లోకములకు ఉపకారము చేయుటకు, భగీరథ పితరులను తరింప చేయుటకు, అగస్త్యుడు తాగిన సముద్రలను నింపుటకు, తనను స్మరించినంత మాత్రమునే ప్రాణుల పాపములను నశింపచేయుటకు భగీరధుడు చెప్పినట్టుగా రసాతలమున ఉన్న కపిల మహర్షి శాపము వలన భస్మము అయి పడి ఉన్న రాజపుత్రులను ముంచి వేసి పవిత్రులను చేసి సముద్ర ఖాతములను నింపివేసెను. ఆ తరువాత గంగానది మేరు పర్వతమున చేరెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *