వంపుతండా సర్పంచ్ గా ధరావత్ వినోద ఏకగ్రీవం..

పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని వంపుతండా గ్రామ సర్పంచ్ గా ధరావత్ వినోద రమేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం రోజున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆ గ్రామం నుండి ధరావత్ వినోద రమేష్ ఒకే నామినేషన్ దాఖలు కాగా ఏకగ్రీవమయింది. ఉపసంహరణ కార్యక్రమం శనివారం కాగా అధికారులు ధరావత్ వినోద రమేష్ ను ఏకగ్రీవ సర్పంచ్ గా ప్రకటించారు.

అలాగే గ్రామంలో నాలుగు వార్డులుండగా ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సర్పంచ్ గా ధరావత్ వినోద రమేష్,ఉప సర్పంచ్ గా ధరావత్ రోజా సురేష్ . వార్డు సభ్యులుగా ధరావత్ దేవా, ధరావత్ అరుణ రాజేష్, ధరావత్ శ్రీను ఏకగ్రీవంగా గెలిచారు.

Leave a Reply