Devotional | భవానీ దీక్షల విరమణ
- ప్రారంభమైన దీక్ష విరమణ మహోత్సవాలు..
- అకుంఠిత దీక్ష. భక్తి ప్రవర్తలతో భవానీల రాక…
- అమ్మ నామస్మరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి…
- మదినిండా అమ్మనే తలుస్తూ గిరిప్రదక్షిణ…
- శోభాయమానంగా అమ్మ ఆలయం..
Devotional | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : జై భవాని.. జై జై దుర్గ భవాని.. నినాదంతో అట్టహాసంగా భవాని దీక్షల విరమణ మహోత్సవం ప్రారంభమయ్యింది. అకుంఠత దీక్ష, భక్తి శ్రద్ధల(Devotional attention)తో మండల, అర్థ మండల దీక్ష స్వీకరించిన భవానీల రాక క్రమంగా పెరుగుతుండడంతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కుతోంది. క్షణక్షణం అమ్మవారి నామస్మరణ మారుమ్రోగుతుండడం, మదినిండా అమ్మనే తలుస్తూ.. పవిత్ర కృష్ణా నదిలో స్నానమాచరించి భవానీలు గిరి ప్రదక్షణను ప్రారంభిస్తున్నారు.
ఆధ్యాత్మికానికి కేంద్ర బిందువుగా ఉన్న ఇంద్రకీలాద్రి పై మరింత శోభయమనం వచ్చేలా సువర్ణ రంగులతో ఆకర్షణీయంగా ప్రత్యేకమైన పూలలాలంకరణ చేశారు. లక్షల సంఖ్య(millions)లో తరలివచ్చే భవానీల కోసం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. భవానీలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తూ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), శీనా నాయక్ లు కలిసి పరిశీలిస్తున్నారు.
అగ్ని ప్రతిష్టాపనతో ఉత్సవాలు ప్రారంభం..

భవాని దీక్షల విరమణలో గురువారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకుల బృందం, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వైదిక కమిటీ సభ్యుల(committee members) ఆధ్వర్యంలో అగ్ని కావిడతో ప్రధాన ఆలయం నుంచి బయలుదేరి పాత మెట్ల మార్గం ద్వారా హోమ గుండాల వద్దకు చేరుకున్నారు. వేద మంత్రోచ్ఛరణలు మధ్య శాస్త్రక్తంగా హోమ గుండాలను ప్రారంభించారు.

దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(Borra Radhakrishna) (గాంధీ), ఈఓ శీనా నాయక్ లు పూజలు నిర్వహించిన అనంతరం అగ్నిని వెలిగించి హోమగుండాలలో కొబ్బరికాయలు పూజా సామాగ్రిని సమర్పించారు. కోమగుండాల పూజ అనంతరం దుర్గగుడి చైర్మన్ ఈవోలు ఇరుముడి పాయింట్లు వద్దకు వెళ్లి మొదటి ఇరుముడిని సమర్పించి అధికారికంగా దీక్ష విరమణ మహోత్సవాలను ప్రారంభించారు.
గురు భవాని గణేష్(Bhavani Ganesh) ఆధ్వర్యంలో ఇరుముడిని తొలగించే ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భవానీలు పెద్ద ఎత్తున జై భవాని జై జై భవాని అనే నినాదంతో ఇరుముడులను సమర్పిస్తున్నారు.
పెరుగుతున్న భవానీల రాక..

భవాని దీక్షల విరమణ సందర్భంగా విజయవాడకు భవానీల రాక క్రమక్రమంగా పెరుగుతుంది. జిల్లా రాష్ట్రం నలుమూలలతో పాటు పలు ప్రాంతాల నుంచి భవానీలు దీక్ష విరమణ కోసం విజయవాడకు పలుమార్గాల ద్వారా తరలివస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి పెద్ద సంఖ్యలో తరలివస్తుండగా తూర్పు పశ్చిమగోదావరి(West Godavari) జిల్లాల నుండి భవానీలు కాళ్ల నడకన అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు.
ముందుగా పవిత్ర కృష్ణా నదిలో స్నానమాచరించి, ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణను పూర్తి చేసుకున్న అనంతరం వినాయకుడి గుడి వద్ద ఉన్న క్యూలైన్లు అటు కుమ్మరిపాలెం వద్ద క్యూలైన్ల ద్వారా కొండ పైకి చేరుకుంటున్నారు. మొదటిరోజు గురువారం తెల్లవారుజామునుండే భవానీలు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లలో ఎదురు చూడటం కనిపించింది.
భవానీల కోసం సౌకర్యవంతంగా వేసిన క్యూలైన్ల ద్వారా అమ్మవారి ప్రధానాలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని చూసి, తరించి, శివాలయం మెట్ల మార్గం ద్వారా మహా మండపం దిగువకు చేరుకుని అక్కడ ఇరుముడిని సమర్పిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమ గుండాలలో నేతి కొబ్బరికాయని సమర్పిస్తున్నారు.
అలాగే భవానీల(Bhavani) కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ, అవసరమైన లడ్డూలను సైతం కొనుగోలు చేస్తున్నారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తున్నారు. భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో ఇంద్రకీలాద్రితో పాటు కనకదుర్గ నగర్ గిరి ప్రదక్షిణ జరుగుతున్న ప్రాంతాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది.

