Devotional | మల్లన్న సేవలో డైరెక్టర్లు
- శ్రీశైలంలో బోయపాటి, తమన్ పూజలు
Devotional | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరామిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను గురువారం అఖండ మూవీ 2 సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ నిర్వాహకులు లడ్డు ప్రసాదాలు శేష వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి అఖండ సినిమా ప్రీమియర్ షో రిలీజ్ కానుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని తెలిపారు.

