NZB | చిన్నమ్మ ఆలయంలో చిలుక… చూసేందుకు పోటెత్తిన భక్తజనం

నిజామాబాద్ ప్రతినిధి, మార్చి 21(ఆంధ్రప్రభ ) : చిలుకల చిన్నమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాలపై చిలుక వచ్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. దేవుని మహిమగా భావించి ఆ దృశ్యాన్ని చూడడానికి తండోప తండాలుగా జనాలు వస్తు న్నారు. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని గాజులపేటలో పురాతన చిలుకల చిన్నమ్మ ఆలయం శిథిలావస్థకు చేరడంతో శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు ఆ ఆలయాన్ని కూల్చి నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో చిలుకల చిన్నమ్మ విగ్రహాన్ని తాత్కాలికంగా షెడ్డులో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిన్నమ్మ విగ్రహం వద్దకు ఒక రామచిలుక వచ్చి విగ్రహం పైన కూర్చుంది. ఈ వింతని చూడటానికి చుట్టుపక్కల కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *