భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి…
ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి గోదావరి నదిలో స్నానం ఆచరించే భక్తులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలపాటి రాంనర్సింహరెడ్డి(Elapati Ramnarsimha Reddy) తెలిపారు. గోదావరి నదిలో లోతైన నీటిలోకి వెళ్లకండ ఉండాలని, మద్యం సేవించి నదిలోకి దిగకూడదని చిన్నపిల్లలు, వృద్ధులు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే స్నానం చేయాలన్నారు.
నదిలో స్నానం చేస్తున్నప్పుడు జారిపడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, విలువైన వస్తువులు (మొబైల్ ఫోన్‌లు, నగలు మొదలైనవి) తీసుకెళ్లవద్దుని సూచించారు. ధర్మపురి పోలీసుల(Dharmapuri Police), రెవెన్యూ, నదీ భద్రతా సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించలని, ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్లు గమనించిన వెంటనే సమీప పోలీసు సిబ్బందికి తెలియజేయాలని కోరారు.
గోదావరి ఘాట్ల పరిసర ప్రాంతాల్లో పార్కింగ్, రోడ్డు రవాణా, క్యూలు తదితరాలపై సూచనలు పాటించలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనపడితే వెంటనే 100 / Dial 112 కు సమాచారం ఇవ్వలని కోరారు. భక్తులందరూ శాంతి, భద్రతతో స్నానం ఆచరించగలిగేలా పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు.

