Devotees | 10 మందికి గాయాలు

Devotees | 10 మందికి గాయాలు

Devotees | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓ వాహనం భక్తులపైకి దూసుకెళ్లడంతో పది మందికి గాయాలైన ఘటన ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

ఆలయ టోల్‌గేట్ వద్ద వేగంగా వచ్చిన ఓ వాహనం నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 10 మందికిపైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది, తోటి భక్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్‌ను స్థానికులు అడ్డుకున్నారు.

Leave a Reply