Devotees | సమ్మక్క సారక్క జాతరను మరింత అభివృద్ధి…

Devotees | సమ్మక్క సారక్క జాతరను మరింత అభివృద్ధి…
- వన దేవతల దీవెనలతో ప్రజలు సుఖ శాంతులతో జీవించాలి.
- జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి …
Devotees | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని మన్సాన్ పల్లి జాతరకు తరలివచ్చిన భక్తులు ప్రశాంత వాతావరణంలో తల్లులను దర్శించుకోవాలని, వన దేవతల దీవెనలతో ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని, మండల పార్టీ నాయకులతో కలిసి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మొక్కులు చెల్లించుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలములోని మన్ సాన్ పల్లి సమక్క సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కోసం, గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకొని, అభివృద్ధి దిశగా కృషి చేద్దాం అన్నారు.
భక్తులకు త్రాగునీటి సరఫరా సౌకర్యాలను, అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్యం, రోడ్ మరమ్మతులు, హై మాస్ ఫ్లడ్ లైట్లు వంటి అభివృద్ధి పనులను ఏర్పాటు చేస్తేనే జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తల్లులను దర్శించుకున్నారు. మినీ సమ్మక్క సారలమ్మ జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి వచ్చే జాతర నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని పేర్కొన్నారు.
జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి, దూడల కనకయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ గీస సందీప్, మాజీ సర్పంచ్ పంజాల తారా శ్రీధర్ గౌడ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, జాతర కమిటీ, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
