Devineni Avinash | వైఎస్ కుటుంబంతోనే ప్రజా పాలన
- రాజశేఖర్ రెడ్డి, జగన్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం
- వారి పాలనాదక్షత చూసి అందరూ నేర్చుకోవాలి
- మళ్లీ రాజన్న రాజ్యం రావడం ఖాయం
- ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
Devineni Avinash | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : కుల మత రాజకీయాలకతీతంగా సంక్షేమాన్ని అందరికీ అందజేసి.. అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన ఇచ్చిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తోపాటు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. వారి హయాంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందన్నఆయన.. వారి పరిపాలన దక్షత అందరూ చూసి నేర్చుకోవాలన్నారు. 2029లో మళ్లీ రాజన్నరాజ్యం రావడం ఖాయమన్నారు.
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవినేని అవినాష్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకి బొకే ఇచ్చి ముందస్తు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలపడుతుందని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. 2029లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయడమే ఏకైక లక్ష్యమని చెప్పారు.

