Devineni Avinash | కూటమి ప్రభుత్వానిది కమీషన్ల కక్కుర్తి

Devineni Avinash | కూటమి ప్రభుత్వానిది కమీషన్ల కక్కుర్తి

  • కోటి సంతకాలతోనైనా కళ్ళు తెరవాలి
  • మెడికల్ కాలేజీలన్నీ కాపాడుకుంటాం..
  • నిరుపేదలకు వైద్యం అందించడమే లక్ష్యం
  • ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్

Devineni Avinash | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న కూటమి ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విద్యను దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం లో మెడికల్ కాలేజీ (Medical College) ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రానికి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో బుధవారం తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి సేకరించిన సంతకాలు జిల్లా ఆఫీస్ పంపుతున్నామన్నారు.

Devineni Avinash

తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 96 వేల మంది సంతకాలు చేశారని, మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చారన్నారు. ప్రతి సంతకం డిజిటలైజ్ చేశామన్న అయన జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ కమిషన్స్ కోసం టీడీపీ ప్రవేట్ కి ఇస్తుందని ఆరోపించారు. 15వ తేదీ జిల్లా కేంద్రం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నామని, 17వ తేదీ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌ని (Governer) కలిసి వాస్తవాలు వివరిస్తారని తెలిపారు. ఈ కోటి సంతకాలు చూసిన కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ గురించి కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్, డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply