Development | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

Development | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి
..ఏకగ్రీవ గ్రామ పంచాయితీ సభ్యులకు సన్మానం
.. మాజీ ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Development | రాజాపేట, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలం మల్లగూడెం గ్రామంలో పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ జన్నెపల్లి బాలరాజు రెడ్డి, ఉపసర్పంచ్ రెడ్డబోయిన కవితరాజు, వార్డు సభ్యులు నీల జహంగీర్, బోయిని నాగరాజు, గొడుగు కల్పన, నీల కనకమ్మలను ఈ రోజు యాదగిరిగుట్టలో మాజీ ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ డిసిసిబి మాజీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి తమ నివాసంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధి (Development)కి కృషి చేసి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. పారదర్శక పాలన, ప్రజా సమస్యల(public issues) పరిష్కారంలో నిబద్ధతతో పని చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సట్టు తిరుమలేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జన్నెపల్లి ప్రభాకర్ రెడ్డి, గొడుగు రాజు, రెడ్డబోయిన రాజు, నీల రాములు, గొడుగు కనకయ్య, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
