12వ వార్డులో అధికార పార్టీ తోటే అభివృద్ధి సాధ్యం

జనగామ , ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున జనగామ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులన్నీ సాధ్యమవుతాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం 12 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వంగ ఉమా యుగంధర్ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అన్నారు. 12 వ వార్డు వివర్స్ కాలనీలోని అనేకమంది చేనేత కార్మికులకు రుణాలు మాఫీ అయ్యాయని వారు తెలిపారు.
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీ అభ్యర్థి వంగ ఉమ యుగేందర్ లను గెలిపించాలని వారు కోరారు. గత పది సంవత్సరాలుగా మున్సిపల్ పరిధిలో బిఆర్ఎస్ అధికారం ఉండటంతో అభివృద్ధి పనులు కొంటుపడ్డాయని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అత్యధిక నిధులు వస్తాయని వాటితో అభివృద్ధి పనులు చేపడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో జనగామ మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులు వచ్చాయని వాటితో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయని వారు తెలిపారు.
నీతి నిజాయితీగా వార్డు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వంగ ఉమ యుగంధర్ లను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో 12 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వంగ ఉమా యుగేందర్ లతోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అల్వాల్ నర్సింగ్ , నల్లగొని బాలకిషన్ గౌడ్ ,అంబాల ఆగయ్య గౌడ్ ,బైరుగోని కనకయ్య గౌడ్ ,బాడేగం వెంకట్ రెడ్డి , కామిడి వెంకట్ రెడ్డి , కర్రె ప్రశాంత్ ,శాకం పల్లి బుచ్చి రెడ్డి బొక్కం నరసింహులు ,వేముల బాలరాజు, కామిడి అమృత రెడ్డి, పులిగిళ్ళ కనకయ్య,మంగళంపల్లి కృష్ణమూర్తి,కంటెం కరుణాకర్, సంజయ్ కుమార్ , శ్రీరామ్ శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, బంతిని వెంకటేష్, కిషోర్, కొండా శ్రీనివాస్ , బొంతపల్లి వెంకటేశ్వర్లు, కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
