Development | నేను మీ సేవకున్ని నన్ను ఆదరించండి
Development | షాద్‌నగర్, ఆంధ్రప్రభ : కల్లబొల్లి మాటలు నమ్మి ఓట్లేసి మొగలిగిద్ద అభివృద్ధిని ఐదేళ్లు వెనకకు తీసుకుపోవద్దని, సమర్థవంతుడైన నాకు ఓటేపి అభివృద్ధి(Development) దిశలో నడిపించేందుకు ప్రజలు సహకరించాలని మొగిలిగిద్ద సర్పంచ్ అభ్యర్థి బుగ్గ కృష్ణ అన్నారు.
ఒక్కసారి అవకాశం ఇవ్వండి మొగలిగిద్దను సుందరంగా తీర్చిదిద్దుతానని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారం(election campaign)లో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఆయన వెంట ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చారు. గ్రామంలో దేవాలయాల అభివృద్ధి, సీసీ రోడ్లు, వీధిలైట్లు, నీటి సరఫరా, మౌలిక సదుపాయాలతో పాటు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. యువతకు తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని పేర్కొన్నారు. నన్ను ఆదరించి కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

