Development | అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి..

Development | అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి..
- విశ్రాంత ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Development | పరకాల, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, విశ్రాంత ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు పట్టణంలోని బొడ్రాయి ప్రాంతంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ప్రచారంలో భాగంగా నాయకుల వెంట 12 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి గంట కళావతి, 15వ వార్డు అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో పట్టణ, గ్రామాలు అభివృద్ధి జరిగిందని, స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధికి దోహదం చేసినట్లు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
