ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా…

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా…

  • తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ తో కలిసి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డులలో జరుగుతున్న మురికి కాల్వ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేస్తామన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో నిధులు మంజూరు చేయించి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో డ్రైనేజీ,మంచినీటి, సీసీ రోడ్డు లాంటి సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరు సమన్వయంతో పట్టణ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నల్లపు రాజు, చీకటి రమేష్, అరుణ్ కుమార్, రాజు, వెంకన్న, సాయి,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply