కార్పోరేషన్లో ముగిసిన ఏసీబీ అధికారుల తనిఖీలు…

కార్పోరేషన్లో ముగిసిన ఏసీబీ అధికారుల తనిఖీలు…
అక్రమాల పై ప్రభుత్వానికి నివేదిక….
ప్లాన్ ఒక చోట బిల్డింగ్ నిర్మాణాలు ఒక చోట …..
మూడవ రోజు వరకు కొనసాగిన సోదాలు…..
విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలో అక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్స్, ప్లాన్ మంజూరులో లోపాలు తదితర అంశాలు పై ఏసీబీ అధికారులకు అందిన పిర్యాదుల ఆధారంగా విజయవాడ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మూడు రోజులగా నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలు, సోదాలు గురువారం ముగిశాయి.
మూడు రోజులగా ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయగా చివరి రోజు కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సాయత్రం వరకు పరిశీలించి కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు.
క్షేత్ర స్థాయిలో పరిశీలన….
విజయవాడ కార్పోరేషన్ పరిధిలోని మూడు సర్కిల్ లో వివిధ ప్రాంతాల్లో ను, ఏసీబీ అధికారులు టీమ్ లుగా ఏర్పడి చేపట్టిన క్షేత్ర స్థాయి తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అనేక అక్రమాలకు ఊతం చేస్తున్నట్లు గుర్తించారు.
కొన్ని మధ్యవర్తులు, పలు పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు సహకారం తో అక్రమ నిర్మాణాలు,అదనపు అంతస్తులు, నగదు రూపంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించి వివరాలు రికార్డు చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో గుర్తించిన పలు అక్రమ నిర్మాణాల పై ప్రత్యేక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అంద జేయనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
